‘బచ్చల మల్లి’గా అల్లరి నరేశ్ ఫస్ట్ లుక్

  • పక్కా మాస్ రోల్ లో అలరించేందుకు వస్తున్న నరేశ్
  • పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ మేకర్స్
  • ఈ నెల 30న టీజర్ గ్లింప్స్ విడుదల
అల్లరి నరేశ్ హీరోగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘బచ్చల మల్లి’.. ఈ సినిమాకు సంబంధించి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. నరేశ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో నరేశ్ నాటు లుక్ లో అదరగొట్టాడు. ఈ నెల 30న టీజర్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు సుబ్బు మంగదెవ్వి దర్శకత్వ బాధ్యతలు చూస్తున్నారు.

కాగా, ఈ ఏడాదిలో అల్లరి నరేశ్ నటించిన రెండు సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి. హీరో నాగార్జున సినిమా ‘నా సామిరంగ’ లో అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషించారు. ఇందులో ఆయన నటనకు మంచి మార్కులే వచ్చాయి. ఇక దీని తర్వాత ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ నరేశ్ హీరోగా వచ్చిన సినిమా పర్వాలేదనిపించింది. ఈ సినిమాల తర్వాత పక్కా మాస్ రోల్ తో సుబ్బు మంగదెవ్వి దర్శకత్వంలో వస్తున్న బచ్చల మల్లి సినిమాపై నరేశ్ అభిమానుల అంచనాలు పెరుగుతున్నాయి.

Allari naresh
Bachala malli
latest movie
Entertainment

More Telugu News